JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

by Ajay Maddhiboyina |

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 21,22,23,24 తేదీల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ jeemain.nta.nic.in అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 21,22,23,24 తేదీల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ jeemain.nta.nic.in అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం మొదటి నాలుగు రోజులకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల చేయగా 28,29న జరిగే పేపర్ 2 పరీక్షకు సంబంధంచిన అడ్మిట్ కార్డులను తరవాత విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు మరో షిఫ్ట్ పరీక్ష జరగనుంది.

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలనుకునేవారు jeemain.nta.nic.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. తరవాత హోంపేజీలోని జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2026 ఆప్షన్ సెలక్ట్ చేయాలి. తరవాత అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంట‌నే అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై క‌నిపిస్తుంది. ప్రింట్ అనే ఆప్ష‌న్ పై క్లిక్ చేస్తే జిరాక్స్ కాపీ పొంద‌వ‌చ్చు. ఒక‌వేళ మీ అడ్మిట్ కార్డ్ లో త‌ప్పులు ఉన్న‌ట్టు అయితే అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేసుకోవ‌చ్చు.

Next Story