జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: తెలుగు విద్యార్థుల ప్రభంజనం

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 16:35:48  IST  )

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి.

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: తెలుగు విద్యార్థుల ప్రభంజనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో ఘనవిజయం సాధించారు. ఈ ఏడాది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు టాప్ స్కోర్లతో మెరిశారు. తెలంగాణకు చెందిన మంథా శివకామేశ్‌, భవితేశ్ రెడ్డి, సాయి రుత్విక్ రెడ్డి, మరియు వివన్‌శరద్ మహేశ్వరి 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు విద్యార్థులు వందకు వంద మార్కులతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఈ నెల (ఏప్రిల్) 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరిగాయి. ఈ పరీక్షల కోసం సుమారు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను NTA అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫలితాలు విడుదల కావడంతో, క్వాలిఫై అయిన విద్యార్థులు ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) పరీక్షకు సిద్ధం కానున్నారు. ఐఐటీల్లో సీట్లే లక్ష్యంగా ఈ మే నెలలో అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు అభినందిస్తున్నారు.

Read More.. ఐఐటీ, నీట్, క్లాట్ లక్ష్యంగా కేజీబీవీల్లో ప్రత్యేక కోచింగ్ హబ్‌లు

Next Story