- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ, నీట్, క్లాట్ లక్ష్యంగా కేజీబీవీల్లో ప్రత్యేక కోచింగ్ హబ్‌లు
గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినులను జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినులను జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థినులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన కోచింగ్, విద్యాపరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుతం వేసవి సెలవుల్లో కూడా ఆయా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కొనసాగుతోంది. ఐఐటీ-జేఈఈ శిక్షణలో హనుమకొండ జిల్లా కమలాపూర్ కేజీబీవీలో 140 మంది, నీట్ కోచింగ్‌లో యాదాద్రి జిల్లా బొమ్మలరామారం కేజీబీవీలో 146 మంది, క్లాట్ కోచింగ్ కు రంగారెడ్డి జిల్లా కందుకూరు, కేజీబీవీలో 82 మంది విద్యార్థులకు కోచింగ్ అందిస్తున్నారు.
ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఎంపీసీ స్ట్రీమ్‌లో రంగారెడ్డి జిల్లా పాలమాకుల కేజీబీవీలో 202 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో జిన్నారం, సంగారెడ్డి 202 మంది, సీఈసీ స్ట్రీమ్‌లో నల్గొండ జిల్లా మునుగోడు కేజీబీవీలో 150 మందికి కోచింగ్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం కేజీబీవీని సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న నీట్ శిక్షణను పరిశీలించిన ఆయన, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాకల్టీ నిబద్ధతను అభినందిస్తూ, విద్యార్థినుల క్రమశిక్షణ, ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా పకడ్బందీ శిక్షణ కారణంగా రాబోయే పోటీ పరీక్షల్లో విద్యార్థినులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.






