- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ పార్టీ చీఫ్‌గా ఏఐ.. కీలక నిర్ణయాలన్నీ దానివే!
by Phanindra |
పార్టీ చీఫ్‌గా ఏఐను నియమించిన జపాన్ పొలిటికల్ పార్టీ ‘పాత్ టు రీబర్త్’. ఇకపై కీలక నిర్ణయాలన్నీ ఏఐనే తీసుకుంటుందని ప్రకటన.

X
దిశ, నేషనల్ బ్యూరో: టెక్నాలజీలో అందరి కన్నా ముందుండే జపాన్ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. అక్కడి సైసే నొ మిచి (పాత్ టు రీబర్త్) అనే రాజకీయ పార్టీ.. తమ తదుపరి అధ్యక్షుడిగా కృత్రిమ మేధ (ఏఐ)ను ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జులైలో జరిగిన జపాన్ ఎగువసభ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన పది మంది నేతలు ఓడిపోయారు. దీంతో పార్టీ వ్యవస్థాపకుడు, చీఫ్ షింజీ ఇషిమర్ పదవి నుంచి తప్పుకున్నారు.
ఈ క్రమంలో క్యోటో యూనివర్సిటీకి చెందిన కోకి ఒకామురా.. నేతలకు, ఏఐ చీఫ్‌కు మధ్య మానవ వంతెనగా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలుస్తోంది. ఏఐ పెంగ్విన్ ఈ పార్టీ లీడర్‌గా ఉంటుందని, పార్టీకి సంబంధించిన కీలకమై నిర్ణయాలన్నీ ఏఐనే తీసుకుంటుందని కోకి తెలిపారు. అయితే ఏఐ లీడర్ ఎప్పుడు పదవి చేపడతారు? ఈ వ్యవస్థను ఎలా నడుపుతారు? అనే వివరాలను ఆ పార్టీ ఇంకా వెల్లడించలేదు.
Next Story






