- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Japan: బద్దలైన షిన్మోడాకే అగ్నిపర్వతం.. ఎగిసిపడుతోన్న పొగ, బూడిద
by Kema Shiva Kumar |
అగ్నిపర్వతం బద్దలైన ఘటన జపాన్ (Japan) దేశంలోని ఇవాళ చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అగ్నిపర్వతం బద్దలైన ఘటన జపాన్ (Japan) దేశంలోని ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మౌంట్ షిన్మోడేక్ (Mount Shinmodek) అగ్ని పర్వతం ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో దట్టమైన బూడిద, పొగ ఆకాశంలోకి ఎగసిపడుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిపర్వతం నుంచి వీలైనంత దూరం వెళ్లిపోవాలని ప్రకటించారు. అగ్నిపర్వతం బద్దలైన క్రమంలో జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక స్థాయిని లెవల్ 3గా ప్రకటించింది. అగ్ని పర్వతం నుంచి రెండు మైళ్ల రేడియస్ వరకు భారీగా రాళ్లు పడే ప్రమాదం ఉందని పైరోక్లాస్టిక్ (Pyroclastic) ప్రవాహాలను సంభవించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే, అగ్నిపర్వతం సమీపంలో దాదాపు 9 లక్షల మందికి పైగా నివాసితులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
Next Story






