- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్ ప్రధాని ఇషిబా రాజీనామా!
జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహించాలి అంటూ సొంత పార్టీ నేతల నుండి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇషిబా ప్రకటించారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే ఇషిబా గతేడాది అక్టోబర్ లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజీనామా చేయాలని సొంత పార్టీలో డిమాండ్లు రావడంతో పదవి నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మెజారిటీని దక్కించుకోలేకపోయింది. తరవాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా ఇషిబా ప్రధాని అయ్యారు. కానీ వరుస అపజయాలతో అవిశ్వాసం పెరగటంతో ఇషిబాను దింపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనే స్వయంలో పార్టీ అధ్యక్ష పదవికి. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రటించారు.






