Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

by Ramesh Goud |   (  Updated:2025-01-13 14:19:39  IST  )

జపాన్‌(Japan)లో భారీ భూకంపం(Major Earthquake ) సంభవించింది.

Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: జపాన్‌(Japan)లో భారీ భూకంపం(Major Earthquake ) సంభవించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై భూకంప తీవ్రత 6.9 గా నమోదు అయ్యిందని ఆ దేశ వాతావరణ శాఖ(Meteorological Agency) వెల్లడించింది. జపాన్ దేశంలోని నైరుతీ దీవులైన(Southwestern Island) క్యుషు(Kyushu) అనే ప్రాంతంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ భూకంపం దాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలకు భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. భూకంప తీవ్రత 6.9 గా నమోదు అయ్యిందని, తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు(Tsunami Warnings) జారీ చేశారు. క్యుషు ద్వీపంలోని మియాజాకి(Miyazaki) ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో ఈ భూప్రకంపణలు వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు అడ్వైజరీ జారీ చేశారు. ఈ భూకంపం దాటికి జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. గతేడాది ఇదే చోట రెండు సార్లు భూకంపం సంభవించినా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story