- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Japan: జపాన్ లో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ఉద్యోగులకు వారంలో 3 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
జపాన్(Japan) దేశంలో గత కొంత కాలంగా సంతానోత్పత్తి రేటు(Fertility Rate)గణనీయంగా తగ్గిపోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan) దేశంలో గత కొంత కాలంగా సంతానోత్పత్తి రేటు(Fertility Rate) గణనీయంగా తగ్గిపోతున్న విషయం తెలిసిందే. ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం జపాన్ 2023లో 7,27,277 జననాల(Births)ను నమోదు చేసింది. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే గత ఏడాది జననాల సంఖ్య 43,482 తగ్గింది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మెట్రోపాలిటన్ ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులే పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నామని ప్రకటించింది.
ఈ నిర్ణయం 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని, ఉద్యోగులు వారంలో మూడు రోజులు సెలవు తీసుకోవచ్చని టోక్యో గవర్నర్(Tokyo Governor) యురికో కోయికే(Yuriko Koike) వెల్లడించారు. టోక్యో నాల్గవ సాధారణ సెషన్‌లో విధాన ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. దేశం యొక్క సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో తగ్గిన నేపథ్యంలో జపాన్ జంటలు పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రసవం లేదా శిశు సంరక్షణ వంటి కారణంగా ఎవరూ తమ వృత్తిని వదులుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా జపాన్ సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు కేవలం 1.2 పిల్లలకు మాత్రమే పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఆ సంఖ్య కనీసం 2.1 ఉండాలి.






