- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా!
త్వరలోనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా. ప్రకటన వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘవాల్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా దక్కుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ)లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా గురించి విలేకరులతో మాట్లాడారు. ఇది చాలా సున్నితమైన విషయమన్న ఆయన.. లోక్‌సభలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చిందన్నారు. ‘మా హోంమంత్రి పార్లమెంటులో జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదాపై మాట్లాడారు. దీనికి ఒక ప్రక్రియ ఉంది. త్వరలోనే ఈ నిర్ణయం వస్తుంది’ అని మేఘవాల్ చెప్పారు. దీనిపై స్పందించిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. ఈ అంశంపై కొంతకాలంగా ఆశాజనకమైన మాటలు వినిపిస్తూనే ఉన్నాయని, ఏడాదిన్నరగా వెయిట్ చేస్తున్నామని, ఈ ప్రకటన వచ్చిన తర్వాతనే ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయని, కానీ ఇప్పటికే రాష్ట్రహోదా ఆలస్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.






