Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. ఓ సైనికుడి మృతి

by vinod kumar |
Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. ఓ సైనికుడి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లోని సోపోర్ (Sopor) ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. సోపోర్ జిల్లాలోని జలూరా గుజ్జరపతి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు, పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే టెర్రరిస్టులు బలగాలపైకి కాల్పులు జరపగా ఓ సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించినట్టు అధికారులు సోమవారం తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరణించిన జవాన్ వివరాలను అధికారులు వెల్లడించలేదు. కాగా, గతేడాది డిసెంబర్ 19న కుల్గామ్ జిల్లాలోని కద్దర్ ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story