చాలా సంతోషంగా ఉంది.. జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |

కేబినెట్ భేటీ వేళ జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఆసక్తికర ట్వీట్ చేశారు.

చాలా సంతోషంగా ఉంది.. జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ భేటీ వేళ జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఆసక్తికర ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి, ప్రజల సంతోషమే అజెండాగా కేబినెట్ భేటీ జరుగుతోందని పేర్కొన్నారు. పెహల్గాం(Pahalgam) ప్రాంతాల్లో మళ్లీ పర్యాటకం పుంజుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం విప్పిన కశ్మీర్ ప్రజలకు, దేశ ప్రజలకు, అండగా ఉన్న సైన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్ సిన్హా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సాయుధ బలగాలు ధైర్య సాహసాలను ప్రశంసించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి మన బలగాలు ఆ దేశానికి గట్టి హెచ్చరికలు చేశాయని అన్నారు. ఇలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాక్‌ భవిష్యత్తులో కనిపించకుండా పోవడం ఖాయమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పటికైనా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న ఆ దేశానికి తగిన శిక్ష పడుతుందని జోస్యం చెప్పారు. భారతదేశ స్థాపకులు కన్న కలలను నేటి యువత నిజం చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను యువకులు కాపాడుతున్నారని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను రక్షించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశానికి సేవచేసే అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story