- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి !
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా బక్రీద్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 28వ తేదీన ఈ పండుగను నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గోవధ జరగకుండా హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు. అవసరమైన చోట దాడులకు కూడా దిగుతున్నారు. అయితే ఇలాంటి క్రమంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గంపై జరుగుతున్న విద్వేష పూరిత ప్రసంగాలు, దాడుల వెనుక ఈ పవిత్ర జంతువు చుట్టూ అల్లుకున్న విభజన రాజకీయాలు కారణమంటూ మండిపడ్డారు.
ఈ విద్వేష రాజకీయాలు, దాడులు పెరుగుతున్న నేపథ్యంలో... వాటిని అరికట్టేందుకు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం శాశ్వతం పరిష్కారం అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించకుండా మోడీ ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటారని నిలదీశారు. అందరూ సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఆవు పేరుతో జరిగే రాజకీయ ఆట ఇకనైనా ఆగిపోవాలని కోరారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే.. దేశ వ్యాప్తంగా విభజన జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.






