Jai shankar: కాల్పుల విరమణకు కారణం చెప్పిన జైశంకర్

by Shamantha N |   (  Updated:2025-06-10 11:00:39  IST  )

సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం దృఢమైన వైఖరిని ఎప్పటికీ అవలంభిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు

Jai shankar: కాల్పుల విరమణకు కారణం చెప్పిన జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం దృఢమైన వైఖరిని ఎప్పటికీ అవలంభిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులు, దేశానికి హానీ చేయాలనుకున్న వారు పాకిస్థాన్ లో ఏ లోతున దాగి ఉన్న వారిని మట్టుబెడతామన్నారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియజేశామని అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికన్ వార్తా వెబ్‌సైట్ POLITICOతో జరిగిన సంభాషణలో, భారతదేశం-పాకిస్తాన్ కాల్పుల విరమణ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించారు.

ఎనిమిది ఎయిర్ బేస్ లు ధ్వంసం చేశాం

గత నెల పదో తేదీన పాకిస్థాన్ లో ఎనిమిది వైమానిక స్థావరాల్ని నేలమట్టం చేశాం. అక్కడ వాటిని విధ్వంసం చేసేశాం. ఒక వేళ నా మాటను మీరు నమ్మకపోతే అందుబాటు గూగుల్ లో ఉన్న చిత్రాలు, ఆ ఎయిర్ బేస్ ల రన్ వేలు, దెబ్బతిన్న హ్యాంగర్ లను చూడొచ్చని జైశంకర్ అన్నారు . దేశానికి హాని చేసే ఉగ్రవాదులు ఎక్కడున్న మాకు పట్టింపు లేదు. వారు పాకిస్తాన్‌లో ఏదో మూలన లోతులో దాక్కుని ఉన్నా.. మేము వారిని అంతం చేస్తాం విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కచ్చితంగా ఉగ్రదాడులు చేస్తే ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని హెచ్చరించారు. భారత వైమానిక దాడులు పాకిస్థాన్ ను తీవ్రంగా దెబ్బతీశాయని జైశంకర్ అన్నారు. రాఫెల్ చాలా ప్రభావితంగా పని చేసింది. ఇతర వ్యవస్థలు కూడా అంతే బాగా పని చేశాయని అన్నారు.

Next Story