- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుతిన్‌తో జైశంకర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
పుతిన్‌తో జైశంకర్ భేటీ.. కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఇరుదేశాల అధినేతల సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మూడో రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. రోజుల రష్యా పర్యటనలో భాగంగా జైశంకర్ మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తదితరులతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై యూఎస్ 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం పుతిన్‌తో తన సమావేశం గురించి ఎక్స్ వేదికగా పలు విషయాలను జైశంకర్ పంచుకున్నారు.
‘మాస్కోలో ప్రెసిడెంట్ పుతిన్‌తో సమావేశవయ్యే గౌరవం దక్కింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాను. రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మాంతురోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో చర్చించిన అంశాలను ఆయనకు వివరించాను. ఇరుదేశాల మధ్య జరిగే వార్షిక లీడర్స్ సమ్మిట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై ఆలోచనలను, ఉక్రెయిన్ విషయంలో తాజా అప్‌డేట్స్‌ను ఆయన నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ అని జైశంకర్ పేర్కొన్నారు. అంతకుముందు సెర్గీ లావ్రోవ్‌తో కలిసి జాయింట్ ప్రెస్‌మీట్‌లో జైశంకర్ మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్థిరంగా ఉన్న ద్వైపాక్షిక బంధాల్లో రష్యా-భారత్ సంబంధాలు ప్రధానమైనవని అన్నారు. రష్యా డిప్యూటీ ప్రధాని డెనిస్ మాంటురోవ్‌తో ఆర్థిక, వాణిజ్య చర్చలు జరిపారు. లావ్రోవ్‌తో ఇరుదేశాల రాజకీయ బంధాలు, ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించే అవకాశం దక్కిందని చెప్పారు.
‘రాజకీయాలు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులు, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్రజాబంధాలపై కూడా చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నా’ అని జైశంకర్ చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ తదితరులు రష్యాలో పర్యటించారని, ఇవన్నీ కూడా రష్యాతో భారత్‌కు ఉన్న బలమైన బంధాన్ని తెలియజేస్తాయని ఆయన అన్నారు.






