Jaishankar: చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

by B.Srinivas |

విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యితో శుక్రవారం భేటీ అయ్యారు.

Jaishankar: చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యి (Wang Yi) తో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ చైనా (India china) సరిహద్దు పరిస్థితులు, మానసరోవర్ యాత్ర (Mansarovar Yatra) పునరుద్ధరణ, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, దీర్ఘకాలంగా ఉన్న ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా అనేక ముఖ్యమైన అంశాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. కైలాష్ మానసరోవర్ యాత్ర, ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పున:ప్రారంభించడానికి ఇరువురు అంగీకరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా, కొవిడ్ మహమ్మారి, 2020లో గాల్వన్ లోయ వివాదం కారణంగా కైలాష్ మానసరోవర్ యాత్ర నిలిచిపోయింది. అలాగే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు సైతం నిలిపివేయబడ్డాయి. దీంతో తాజా భేటీలో వీటిని తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadeer Jaiswal) సైతం జైశంకర్, వాంగ్ యి భేటీపై స్పందించారు. ఇద్దరు మంత్రులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపినట్టు వెల్లడించారు.


Next Story