- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jaishaker: నచ్చకపోతే భారత ఉత్పత్తులు కొనకండి.. విదేశాంగ మంత్రి జైశంకర్
భారత్ నుంచి చమురు, శుద్ది చేసిన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఏ దేశానికైనా సమస్య ఉంటే వారు దానిని కొనొద్దని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ నుంచి చమురు, శుద్ది చేసిన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఏ దేశానికైనా సమస్య ఉంటే వారు దానిని కొనొద్దని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) తెలిపారు. ఇండియా ఏ దేశాన్ని బలవంతం చేయబోదని స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఆయన ప్రసంగించారు. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ యూరప్, ఇతర దేశాలకు విక్రయిస్తోందని అమెరికా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. యూఎస్ వాదన హాస్యాస్పదంగా ఉందన్నారు. రష్యా చమురు దిగుమతులు జాతీయ, ప్రపంచ ప్రయోజనాలకు సంబంధించినవని తెలిపారు. చమురు ధరలను స్థిరీకరించడంలో అవి ఎంతో సహాయపడతాయన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాము నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భారత్ కొన్ని నిబంధనలు విధించిందని, కాబట్టి రెడ్ లైన్స్ దాటి ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేమని తెలిపారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలపై రాజీపడబోదని తేల్చి చెప్పారు. వారి ప్రయోజనాలకు కాపాడటానికే కృషి చేస్తామని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించలేదన్నారు. అమెరికా పాక్ మధ్య ఉన్న సంబంధాలను యూఎస్ మర్చిపోతుందని, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది లాడెన్ 2011లో పాకిస్తాన్‌లో దొరికాడని గుర్తు చేశారు.






