మాన‌వాళిని నాశ‌నం చేస్తుంది..రోబో సినిమాను గుర్తు చేస్తున్న AI గాడ్ ఫాదర్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

ఏఐ సృష్టిక‌ర్త‌గా చెప్పుకునే జాఫ్రీ హింట‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వేగాస్ లో జ‌రిగిన ఏఐ4 స‌మావేశంలో జాఫ్రీ హింట‌న్ మాట్లాడారు. భ‌విష్య‌త్ లో ఏఐ మాన‌వాలినే తుడిచిపెట్టే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీన్ని నివారించాలంటే భావోద్వేగ స్పంద‌న‌లు ఉండేలా ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌ను తీసుకురావాల‌ని సూచించారు.

మాన‌వాళిని నాశ‌నం చేస్తుంది..రోబో సినిమాను గుర్తు చేస్తున్న AI గాడ్ ఫాదర్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏఐ టెక్నాల‌జీ దిన‌దినాభివృద్ధి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. రోజుకో ఏఐ టూల్ మార్కెట్ లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే జెమిని, మెటా ఏఐ, గ్రోక్, ప‌ర్ ప్లెక్సిటీ, క్లౌడ్ ఏఐ లాంటివి వినియోగంలో ఉన్నాయి. చాలా మంది వీటిని వినియోగంచ‌డానికి స‌బ్‌స్క్రిప్షన్‌లు తీసుకుంటున్నారు. వీటి వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాలలోనూ ఏఐ వల్ల ఉద్యోగాలు పోయాయి. ఈ రేంజ్‌లో ఏఐ వినియోగం పెరిగిన సమయంలో ఏఐ సృష్టిక‌ర్త‌గా చెప్పుకునే జాఫ్రీ హింట‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వేగాస్ లో జ‌రిగిన ఏఐ4 స‌మావేశంలో జాఫ్రీ హింట‌న్ మాట్లాడారు.

భ‌విష్య‌త్ లో ఏఐ మాన‌వాలినే తుడిచిపెట్టే ప్ర‌మాదం ఉంద‌న్నారు. దీన్ని నివారించాలంటే భావోద్వేగ స్పంద‌న‌లు ఉండేలా ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌ను తీసుకురావాల‌ని సూచించారు. ఆ వ్య‌వ‌స్థ‌ల‌కు మాన‌వుల సంర‌క్ష‌ణ గురించి అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ప్ర‌స్తుతం ఏఐ వ్య‌వ‌స్థ‌లు మాన‌వుడి నియంత్ర‌ణ‌లో ఉన్నాయ‌ని కానీ ఎప్ప‌టికీ ఇలానే ఉంటాయ‌ని చెప్ప‌లేమ‌న్నారు. ఏఐ మ‌నిషి మేధ‌స్సును అధిగ‌మిస్తే, మ‌న ప‌రిమితుల‌ను అధిగ‌మించేందుకు కొత్త మార్గాల‌ను సైతం అన్వేషించ‌గ‌ల‌వ‌ని హెచ్చరించారు.

అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం వ్య‌క్తిగ‌త ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టాన‌ని ఓ ఇంజినీర్ ను ఏఐ బ్లాక్ మెయిల్ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే జాఫ్రీ హింట‌న్ మాట‌లు రోబో సినిమాను గుర్తు చేసేలా ఉన్నాయి. రోబో సినిమాలో వషీక‌ర్ త‌యారు చేసిన చిట్టి రోబో చివ‌రికి అత‌డికే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. చిట్టికి భావోద్యేగాల‌కు సంబంధించిన చిప్ అమ‌ర్చ‌డంతో ఏకంగా వశీక‌ర్ ప్రేయ‌సినే రోబో ప్రేమిస్తుంది. చివ‌రికి అత‌డిపైనే దాడి చేసే చంపేసే వ‌ర‌కు వెళుతుంది. ఆ త‌ర‌వాత ఇప్పుడు ఇంత టెక్నాల‌జీ అవ‌స‌రం లేద‌ని వ‌శీక‌ర్ దానిని నాశనం చేస్తాడు. ఇక తాజాగా జాఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్య‌లు సైతం మనుషుల‌నే నాశనం చేసే టెక్నాల‌జీ అవ‌స‌ర‌మా? అనిపించేలా చేస్తున్నాయి.

Next Story