PM Narendra Modi : అదంతా వదంతి మాత్రమే : ప్రధాని మోడీ

by Muthe.Rajitha |   (  Updated:2025-02-11 11:27:46  IST  )

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

PM Narendra Modi : అదంతా వదంతి మాత్రమే : ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్(France) పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. పారిస్(Paris) లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ(AI Summit In France) సమావేశానికి సహ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ.. ఏఐ విషయంలో ప్రపంచం అంతా కలిసి ముందుకు వెళ్లాలని అన్నారు. ఏఐ వల్ల అన్ని పనుల్లో మార్పులు వచ్చే మాట నిజమే కానీ, దానితో ఉద్యోగాలు పోతాయనేది వదంతి మాత్రమే అని కొట్టి పడేశారు. ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళితే వారికి అందరికంటే ఉన్నత అవకాశాలు వస్తాయని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ లో భారత్ దూసుకుపోతుందని మోడీ తెలియ జేశారు. దేశాన్ని ఏలడం అంటే విపక్షాలను ఎదుర్కోవడం ఒకటే కాదని, అన్ని రకాల ఆవిష్కరణలు ఎప్పటికప్పుడూ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఏఐతో వచ్చే అద్భుత ఆవిష్కరణలు మీద మాత్రమే కాకుండా.. దీనితో వచ్చే ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాంకేతికతను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు దేశాల అధినేతలకు, టెక్ రంగ నిపుణులకు పిలిపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చేస్తుందని.. ఈ శతాబ్దానికి మానవాళికి గొప్ప ఆవిష్కరణ అన్నారు. కాగా ఏఐలో భారత్ టెక్నాలజీని ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు.

Next Story