మునీర్‌కు ప్రమోషన్ ఇవ్వడం నా నిర్ణయమే.. పాక్‌ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-22 05:10:29  IST  )

ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ (Asim Munir)ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ ఇవ్వడం పూర్తిగా తన నిర్ణయమేనని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

మునీర్‌కు ప్రమోషన్ ఇవ్వడం నా నిర్ణయమే.. పాక్‌ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ (Asim Munir)ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ ఇవ్వడం పూర్తిగా తన నిర్ణయమేనని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు పదోన్నతి విషయంపై తన అన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) సలహా తీసుకున్నప్పటికీ.. నిర్ణయం తీసుకుంది తానేనని అన్నారు. 1959లో జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ హోదాను పొందిన మొదటి జనరల్‌గా మునీర్ నిలిచాడని పేర్కొన్నారు.

మే 10న ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో మునీర్ బాధ్యతాయుతంగా పని చేశారని కితాబిచ్చారు. యుద్ధం ఒక పక్షం విజయానికి, మరొక పక్షం ఓటమికి మాత్రమే దారి తీస్తుంది పేర్కొన్నారు. శాశ్వత శాంతి మాత్రమే సురక్షిత భవిష్యత్తుకు దారి చూపిస్తుందని కామెంట్ చేశారు. ఉగ్రవాదంపై చర్చలు జరిగినప్పుడు అవి కేవలం భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) భద్రతా సలహాదారుల జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సంభాషణలలో మూడో దేశానికి చోటు లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్ (Kashmir) సమస్య రెండు దేశాల ద్వైపాక్షిక విషయమని ఇందులో ఎవరు తలదూర్చొద్దని అన్నారు. భవిష్యత్తులో భారత్‌తో చర్చలంటూ జరిగితే అవి కాశ్మీర్, నీరు, వాణిజ్యం, ఉగ్రవాదంపైనే అని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

Next Story