'సంచార్ సాథీ' యాప్ స్వచ్ఛందంగా ఉంటేనే మంచిది: ఎంపీ శశి థరూర్

by Malleboina Mahesh |

సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం "సంచార్ సాథీ" యాప్‌ ("Sanchar Saathi" app)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ను ప్రతి కొత్త మొబైల్ ఫోన్ లో ఇన్ బుల్డ్ గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఆదేశించింది.

సంచార్ సాథీ యాప్  స్వచ్ఛందంగా ఉంటేనే మంచిది: ఎంపీ శశి థరూర్
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం "సంచార్ సాథీ" యాప్‌ ("Sanchar Saathi" app)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ను ప్రతి కొత్త మొబైల్ ఫోన్ లో ఇన్ బుల్డ్ గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫోన్‌లలో సైతం "సంచార్ సాథీ" యాప్ ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది. కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు, విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. "సంచార్ సాథీ" యాప్‌ను తొలగించలేని విధంగా రూల్స్ తీసుకురావడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో 'సంచార్ సాథీ' అప్లికేషన్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Congress MP Shashi Tharoor) తప్పుబట్టారు.

ఇలాంటి యాప్‌లు స్వచ్ఛందంగా (Voluntary) ఉన్నట్లయితేనే ఉపయోగకరంగా ఉంటాయని, అవసరమున్న ప్రతి ఒక్కరూ వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వీలుండాలని ఆయన అన్నారు. "ప్రజాస్వామ్యంలో దేనినైనా తప్పనిసరి చేయడం ఇబ్బందికరమని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న తర్కాన్ని (Logic) తాను మరింతగా పరిశీలించాల్సిన అవసరం ఉందని థరూర్ మీడియాతో అన్నారు. కేవలం మీడియా నివేదికల ద్వారా ఆదేశాలు జారీ చేయకుండా, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story