- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి దశలో సాంకేతిక సమస్య.. PSLV -C61 ప్రయోగం ఫెయిల్
PSLV -C61 ప్రయోగం అసంపూర్తిగా ముగిసింది. ఈ రోజు ఉదయం ఐదు గంటల 59 నిమిషాలకు ఇస్రో PSLV -C61ను శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది.

దిశ, వెబ్ డెస్క్: PSLV -C61 ప్రయోగం అసంపూర్తిగా ముగిసింది. ఈ రోజు ఉదయం ఐదు గంటల 59 నిమిషాలకు ఇస్రో PSLV -C61ను శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. పూర్తి విదేశీ పరిజ్ఞానంతో.. రూపొందించిన.. EOS -9 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మొదటి రెండు దశలు విజయవంతంగా పూర్తి చేసిన PSLV -C61 చివరి దశలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో రాకెట్ వెళ్లాల్సిన దారి తప్పినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు (ISRO scientists) గుర్తించారు. రాకెట్ దారి తప్పడం పై స్పందించిన ఇస్రో చైర్మన్ వి. నారాయణ (V. Narayana) తమ ప్రయోగాన్ని పూర్తి చేయలేక పోయినట్లు ప్రకటించారు. అలాగే ఈ ప్రయోగం పూర్తి కావడం పై విశ్లేషణ చేస్తున్నమని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా వి. నారాయణ ఇస్రో చైర్మన్ (ISRO Chairman)గా భాద్యతలు తీసుకున్న తర్వాత ఇదే మొదటి ప్రయోగం కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది.
- Tags
- PSLV -C61






