LVM3–M5 రాకెట్‌ ప్రయోగం విజయవంతం.. ఇస్రో చీఫ్‌ నారాయణన్‌ కీలక సందేశం

by Malleboina Mahesh |

ఈ రోజు శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి ఎగిసిన ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ విజయం భారత్‌ కమ్యూనికేషన్‌ శక్తికి కొత్త మైలురాయిగా నిలిచింది. ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంపై ISRO చీఫ్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ కీలక సందేశం ఇచ్చారు.

LVM3–M5 రాకెట్‌ ప్రయోగం విజయవంతం.. ఇస్రో చీఫ్‌ నారాయణన్‌ కీలక సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి ఎగిసిన ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ విజయం భారత్‌ కమ్యూనికేషన్‌ శక్తికి కొత్త మైలురాయిగా నిలిచింది. ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంపై ISRO చీఫ్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ (Dr. V. Narayanan) కీలక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) LVM3–M5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపిన CMS–03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహం భారత భూభాగంతో పాటు సమీప సముద్ర ప్రాంతాలపై విస్తృత కవరేజ్‌ అందిస్తుంది. కనీసం 15 సంవత్సరాలపాటు సేవలు అందించేలా రూపొందించిన ఈ మల్టీ–బ్యాండ్‌ ఉపగ్రహం, అనేక కొత్త సాంకేతికతలను కలిగి ఉంది. ఇది “ఆత్మనిర్భర్‌ భారత్‌” సిద్ధాంతానికి మరో ప్రకాశవంతమైన ఉదాహరణ నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

అలాగే.. ఈ మిషన్‌ సమయంలో వాతావరణ పరిస్థితులు సవాళ్లను విసిరినప్పటికీ, శాస్త్రవేత్తల బృందం కృషితో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించగలిగామని అన్నారు. అంతేకాక, ఈ సారి రాకెట్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన C–25 క్రయోజెనిక్‌ ఇంజిన్‌పై కీలక ప్రయోగం నిర్వహించామని తెలిపారు. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన అనంతరం, ఇంజిన్‌ను మళ్లీ విజయవంతంగా రీ–ఇగ్నైట్‌ చేయడం ద్వారా భవిష్యత్తులో ఒకే మిషన్‌లో పలు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ఉంచే సాంకేతిక సామర్థ్యానికి మార్గం సుగమం కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ “బాహుబలి రాకెట్‌ LVM3 భారత అంతరిక్ష ప్రగతికి మరో గొప్ప దశను సూచిస్తోంది" అని నారాయణన్‌ గర్వంగా చెప్పుకొచ్చారు.

Next Story