- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israeli airstrikes: గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 48 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాపై వరుసదాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాపై వరుసదాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఉత్తర గాజాలోని ఇళ్లపై మంగళవారం రాత్రి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ భీకర దాడిలో 48 మంది పౌరులు మృతిచెందగా.. అందులో 22 మంది చిన్నారులు ఉన్నట్లు జబాలియాలోని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పలు భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయన్నారు. కాగా.. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. హమాస్ ఒక ఇజ్రాయెల్-అమెరికన్ బందీని విడుదల చేసిన తర్వాత ఈ దాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న సమయంలోనే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం.
నెతన్యాహు ఏమన్నారంటే?
యుద్ధం గురించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవలే మాట్లాడారు. గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి మార్గం లేదని స్పష్టం చేయడంతో యుద్ధ విరమణపై ఆశలు తగ్గిపోయాయి. హౌతీలు ఇటీవల ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడడంతో నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కచ్చితంగా హౌతీ రెబల్స్ పై దాడులు చేస్తామన్నారు. గతంలో ఐడీఎఫ్ చేసిన దాడులను వారు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈసారి దాడులు మామూలుగా ఉండవని.. బాంబుల మోతలు హోరెత్తుతాయని హెచ్చరించారు. ఇకపోతే, హమాస్- ఇజ్రాయెల్ మధ్య రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఇప్పటివరకు హమాస్ తన ఒప్పందంలో భాగంగా మొత్తం 22 మంది ఇజ్రాయెల్ వాసులను విడుదల చేసింది. అయితే, బందీల విడుదల ఆలస్యంపై అమెరికా అధ్యక్షుడు హమాస్‌కు డెడ్‌లైన్ విధించారు. వారిని త్వరగా విడుదల చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.






