- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel: మళ్లీ దాడి జరిగితే తీవ్రంగా జవాబిస్తాం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
అమెరికా మధ్య వర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మధ్య వర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే ప్రతిస్పందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. ఇటీవల జరిగిన 12 రోజుల యుద్ధానికి ఇజ్రాయెల్, అమెరికాలే కారణమని, ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించాలని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్‌రహీం మౌసావి (Abdolrahim Mousavi) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన టెహ్రాన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటించడంపై తమకు తీవ్రమైన సందేహాలున్నాయని తెలిపారు. మళ్లీ దాడి జరిగితే ఈసారి తీవ్రంగా ప్రతిస్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తాము యుద్ధాన్ని ప్రారంభించలేదని, అయినప్పటికీ శక్తినంతా ఉపయోగించి ప్రతిస్పందించామన్నారు. ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు తెగబడితే మాత్రం ఈ సారి విధ్వంసమే జరుగుతుందని హెచ్చరించారు. కాగా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇటీవల జరిగిన భీకర యుద్ధం తర్వాత సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి. ఈ క్రమంలోనే ఇరాన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






