- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరియాకు ఎదురుదెబ్బ.. ప్రధాని కార్యాలయం పై ఇజ్రాయెల్ దాడి!
ఇజ్రాయెల్ (Israel) అలాగే సిరియా ( Syrian ) మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల్లో

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ (Israel) అలాగే సిరియా ( Syrian ) మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో సిరియాకు ఎదురు దెబ్బ తగిలింది. సిరియా రాజధాని డమాస్కస్ లో ఉన్న సైనిక ప్రధాన కార్యాలయం పై ఇజ్రాయెల్ సైన్యం... ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో సిరియా ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ అధికారికంగా వెల్లడించింది.
అదే సమయంలో రక్షణ శాఖ కార్యాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిందని సిరియా సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సంఘటనలో ప్రధాని కార్యాలయం పై కూడా దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కేవలం సైనిక ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అటు సిరియా రక్షణ శాఖ కార్యాలయం పై ఇజ్రాయిల్ దాడి చేసింది.
లైవ్ లో ఓ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా వెనుక నుండి దాడి జరిగింది. దీంతో ఆ యాంకర్ ఉలిక్కి పడి పారిపోయింది. సిరియాలోని స్వెయిదా ప్రాంతంలో... స్థానిక మిలేషియాల మధ్య సాయుధ ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో మొత్తం 100 మంది మృతి చెందారు. మైనారిటీ షియా తెగకు చెందిన దృజ్ మిలేషియాకు అలాగే సున్ని బెడ్విన్ తెగలకు మధ్య ఆదివారం దర్శన వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.






