- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Israel: గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 72 మంది మృతి

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అగ్రిమెంట్ ప్రకటించినప్పటి నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (Idf) చేసిన వైమానిక దాడుల్లో 72 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మృతి చెందిన వారిలో 20 మంది చిన్నారులు, 25 మంది మహిళలు ఉండగా సుమారు 200 మంది గాయపడ్డారని పేర్కొంది. ఓ ఐదు అంతస్థుల భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయగా భవనం మొత్తం కూలిపోయినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. కాగా, సుధీర్ఘ చర్చల అనంతరం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీనిని హమాస్ ధ్రువీకరించగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం దీనికి ఇంకా టైం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాజాపై దాడులు జరగడం గమనార్హం.
కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం: భారత్
గాజాలో 15 నెలల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికేందుకు రూపొందించిన ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడాన్ని భారత్ స్వాగతించింది. గాజా ప్రజలకు సురక్షితమైన, స్థిరమైన మానవతా సహాయం అందించడానికి కాల్పుల విరమణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బందీల విడుదల, కాల్పుల విరమణ, దౌత్య మార్గానికి తిరిగి రావాలని నిరంతరం పిలుపునిచ్చామని గుర్తు చేసింది. తాజా ఒప్పందంతో గాజాకు మరింత సాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.