- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 66 వేల మంది పాలస్తీనియన్లు మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 66 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 1.68 లక్షల మందికిపైగా క్షతగాత్రులుగా మిగిలారని గాజా వైద్యశాఖ తెలిపింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 66 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని గాజా వైద్యశాఖ మంత్రి వెల్లడించారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడం గురించి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు కలవడానికి ఒక రోజు ముందు ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం. ఇదే సమయంలో గాజాలోని నూజీరత్ రెఫ్యూజీ క్యాంప్‌పై రెండు దాడులు జరిగాయని, వాటిలో కనీసం పది మంది మరణించారని స్థానిక ఆస్పత్రులు తెలిపాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత.. ఇజ్రాయెల్ భారీ స్థాయిలో యుద్ధం మొదలుపెట్టింది. సుమారు రెండేళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 66,005కు చేరిందని, అలాగే 1.68 లక్షల మంది గాయపడ్డారని గాజా వైద్య శాఖ వెల్లడించింది.
Next Story






