ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్.. ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణుల వర్షం

by Mahesh Kanagandla |

రాత్రిపూట మరోసారి క్షిపణుల దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ డజన్ల కొద్ది మిస్సైళ్లు, వందలాది డ్రోన్లతో ఇరాన్ పై దాడి చేసింది. ప్రతిగా ఇరాన్ కూడా డజన్లకొద్ది బాలిస్టిక్ మిస్సైళ్లతో ప్రతిదాడి చేసింది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు అన్నింటిని ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయింది.

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్.. ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణుల వర్షం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాత్రిపూట మరోసారి క్షిపణుల దాడులు( Missile Attack) జరిగాయి. ఇజ్రాయెల్(Israel) డజన్ల కొద్ది మిస్సైళ్లు, వందలాది డ్రోన్లతో ఇరాన్(Iran) పై దాడి చేసింది. ప్రతిగా ఇరాన్ కూడా డజన్లకొద్ది బాలిస్టిక్ మిస్సైళ్లతో ప్రతిదాడి చేసింది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు అన్నింటిని ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయింది. జెరూసలేం, టెల్ అవీవ్ వంటి ప్రధాన నగరాలపైనా ఈ క్షిపణులు పడ్డాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులు మరణించినట్టు కథనాలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడినట్టూ తెలిసింది. పలు హాస్పిటళ్లలో గాయపడినవారికి ట్రీట్‌మెంట్ అందుతున్నది. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నవారూ ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉన్నది. పౌరుల ఆవాసాలను ఇరాన్ లక్ష్యం చేసుకోవడంపై ఇజ్రాయెల్ మండిపడుతున్నది. ఇరాన్ క్షమించరాని తప్పు చేసిందని విమర్శించింది. రెండోసారి జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఫొర్దో, ఇస్ఫాన్ న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.

Next Story