- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌కు చుక్కలు చూపిస్తున్న ఇజ్రాయెల్.. టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి
యద్దంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా టెహ్రాన్ విమానాశ్రయం లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో విమానాశ్రయంలోని ఎఫ్ 14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: యద్దంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా టెహ్రాన్ విమానాశ్రయం లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో విమానాశ్రయంలోని ఎఫ్ 14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ షేర్ విడుదల చేసింది. టెహ్రాన్ విమానాశ్రయంపై దాడి చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిందని తెలిపింది.
ఇరాన్ తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందనే సమాచారంతో జెట్ విమానాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఈ దాడిలో విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ యుద్ధ విమనాలను 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్‌కు ముందు అమెరికా వీటిని ఇరాన్‌కు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇప్పటికీ ఆ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను సైతం ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్‌కు తీవ్ర నష్టం జరిగినట్టు కనిపిస్తోంది.






