- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 64 మంది మృతి
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం (Israel Attack on Gaza) సృష్టిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకూ వైమానిక దాడుల (Air strikes)తో విరుచుకుపడగా.. సుమారు 64 మంది పౌరులు మరణించారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం (Israel Attack on Gaza) సృష్టిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకూ వైమానిక దాడుల (Air strikes)తో విరుచుకుపడగా.. సుమారు 64 మంది పౌరులు మరణించారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. డీర్ అల్-బాలా, ఖాన్ యూనిస్ (Khan Yunis) నగర శివారుల్లో ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులకు పాల్పడగా.. డజన్లకొద్దీ మరణించారని పేర్కొన్నారు. 48 మృతదేహాలను ఇండోనేషియా (Indonasia) ఆస్పత్రికి, 16 మృతదేహాలను నాజర్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మరో 100 మందికి పైగా గాయపడగా వారందరినీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పశ్చిమాసియా పర్యటనలో ఉన్న వేళ.. ఐడీఎఫ్ దళాలు గాజాపై వరుస దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
వరుసగా మూడురోజులు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో వందల సంఖ్యలో పౌరులు మరణించారు. సౌత్ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బుధ, గురువారాల్లో దాడులు చేయగా 54 మంది మరణించారు. వారిలో ఒక రిపోర్టర్ ఫ్యామిలీలో 11 మంది కూడా ఉన్నారు. మంగళవారం రాత్రి నిర్వహించిన దాడుల్లో 22 మంది చిన్నారులు సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ (Hamas) ఉగ్రవాద సంస్థను అంతమొందించే వరకూ గాజా స్ట్రిప్ లో యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (benjamin netanyahu) ఇటీవల తెలిపారు.






