- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది కదా రైతు దెబ్బ.. మహారాష్ట్ర రైతు ఐడియాతో దళారుల దోపిడికి చెక్
ఓ పసుపు రైతు చేసిన ఆలోచన ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రైతే రాజు అనే నమ్మే మన దేశంలో రైతుగా పుట్టడం కంటే మరో పెద్ద నేరం లేదనే అభిప్రాయం కూడా ఉంది. ఓ వైపు ప్రకృతి వైపరిత్యాలు అన్నదాతలను ముంచేస్తుంటే చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని వెళ్తే దళారులు నిలువునా దోచేస్తున్నారు. దీంతో చేతికొచ్చిన పంటకు సరైన గిట్టుబాటు లేక రైతులు నిండా మునుగుతున్నారు. రైతుల వద్ద చౌకకు కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తల ధరలు అంతిమ వినియోగానికి వచ్చేసరికి ఆకాశానికి అంటుతున్నాయి. ఈ మధ్యలో దళారుల దోపిడీ, రకరకాల ట్యాక్సులతో వ్యాపారులే లభాపడుతున్నారు తప్ప రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో దేశంలోని ఈ దళారీ వ్యవస్థకు వ్యతిరేక ఓ మహారాష్ట్ర రైతు చేసిన ఆలోచన అందరిని ఆలోచింప చేస్తోంది. తాను పండించే పసుపు పంటను తానే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి విక్రయించుకోవడంతో ఇప్పుడు లాభాల బాట పట్టాడు. రైతు శివాజీ కుర్హే విజయగాథ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.
రెట్టింపు లాభం:
విదర్భ ప్రాతంలోని వాశిమ్ జిల్లాకు చెందిన శివాజీ కుర్హే ఓ పసుపు రైతు. పసుపు పంటను మార్కెట్ లో అమ్మితే కిలో రూ. 130 ఇస్తారు. కానీ తాను అమ్మితే గిట్టుబాటు కూడా అంతత మాత్రమే ఉండేది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఓ ఆలోచన చేశాడు శివాజి. తన పొలంలో పండించిన పసుపును ఈయన నేరుగా ప్రజల ఇంటి వద్దకు తీసుకు వెళ్తున్నాడు. వినియోగదారుల అవసరం మేరకు వారి ముందే పసుపు మర పట్టించి విక్రయిస్తున్నాడు. ఇందుకోసం ఆయన ఓ ప్రత్యేక వాహంపై ఓ యంత్రం అమర్చుకున్నాడు. ఇలా తాను రోజుకు 50 కిలోల వరకు పసుపుపొడిని అమ్ముతున్నట్లు శివాజీ మీడియాకు తెలిపారు. పసుపును వ్యాపారులకు అమ్మితే వచ్చే దానికంటే ఇది రెట్టింపు అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకుముందు తాను పసుపు కొమ్ములను గ్రైండర్ సెటప్ ను ఓ ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లేవాడినని దాంతో రోజుకు కేవలం 20 కిలోల పసుపు పొడిని మాత్రమే అమ్మేవాడిని. కానీ ఇప్పుడు నేను పంజాబ్ నుండి రూ.2.5 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక వాహనాన్ని తెప్పించానని దాంతో ఇప్పుడు ప్రతిరోజూ కనీసం 50 కిలోల పసుపు పొడిని అమ్మగలుగుతున్నానని చెప్పారు.
ప్రజల మద్దతు:
కల్తీ లేని స్వచ్ఛమైన పసుపును ప్రజలకు వారి కళ్లముందే మర పట్టించి ఇస్తుండటంతో తనకు ప్రజలు సైతం మద్దతు ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మిగతా రైతులు సైతం తమ ఉత్పత్తులను మధ్యవర్తులకు విక్రయించకుండా వాటిని కాస్త ప్రాసెస్ చేయగలిగి నేరుగా వినియోగదారులకు విక్రయిసతే మంచి ఆదాయం పొందవచ్చని అభిప్రాయపడుతున్నాడు. ఇదే జరిగితే రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్, రుణమాఫీలు చేయాల్సిన అవసరం కూడా ఉండదని తెలిపారు.






