- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఆత్మాహుతి దాడి కుట్ర భగ్నం.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ పేలుళ్లు, ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసిన ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ పేలుళ్లు, ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి ప్రేరణ పొందిన ఆ ఇద్దరినీ నిఘా సంస్థలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాయి. అరెస్టైన వ్యక్తులు ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరిని మధ్యప్రదేశ్ లోనే అరెస్ట్ చేసి.. ఢిల్లీకి తరలించారు. మరొకరిని అద్నాన్ అనే వ్యక్తిగా గుర్తించారు.
ఈ ఆపరేషన్‌లో పూర్తి నెట్వర్క్‌ను వెలికితీసి.. మాడ్యూల్‌లోని ఇతర సభ్యుల్ని కూడా గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అడిషినల్ కమిషనర్ ప్రమోద్ కుష్వాహా, ఏసీపీ లలిత్ మోహన్ నేగి నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వివవరించారు.






