- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Attack: పాక్ కపట నాటకం.. పహల్గాం దాడి వెనుక ఐఎస్ఐ, పాకిస్థాన్ సైన్యం ప్రత్యక్ష హస్తం.. సంచలన నివేదిక
Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిని యావత్ ప్రపంచం ఖండించింది.

దిశ, వెబ్ డెస్క్: Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ఎం బుకాయించినప్పటికీ, లభించిన ఆధారాలను బట్టి చూస్తే, పహల్గామ్‌పై దాడి చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపడమే కాకుండా, పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, పాక్ సైన్యం కూడా ఈ దాడిలో పూర్తిగా పాల్గొన్నాయని ఎన్ఐఏ నివేదికలో స్పష్టమవుతోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి ఐఎస్ఐ మరియు పాకిస్తాన్ సైన్యం సహాయంతో జరిగింది. ఈ విషయం NIA ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీల సమాచారం ప్రకారం, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఇద్దరు ప్రధాన ఉగ్రవాదులు, హష్మీ మూసా, అలీ భాయ్ పాకిస్తానీలు అని పేర్కొంది. వీరే ఈ దాడికి నాయకత్వం వహించారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే, ఐఎస్ఐ, పాక్ సైన్యం కుట్రకు సంబంధించిన ఆధారాలను ఎన్ఐఏ దర్యాప్తు నివేదిక కనుగొంది. ఇందులో ప్రధానంగా బేసరన్ లోయలో ఉగ్రవాదులు ఆయుధాలు దాచిపెట్టారని దర్యాప్తులో తేలింది. అలాగే ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGW) ప్రస్తావించారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికలో, NIA దాదాపు 150 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది.3D మ్యాపింగ్ ఉపయోగించిన నివేదికలు కూడా ఈ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
సంఘటనా స్థలంలో దొరికిన ఖాళీ కాట్రిడ్జ్‌లను FSLకి పంపారు, దీని నివేదిక ఇంకా రాలేదు. NIA ప్రాథమిక దర్యాప్తు నివేదికలో POK గురించి ప్రస్తావించగా, ఉగ్రవాదులు POKలోని వారి నిర్వాహకులతో సంప్రదింపులు జరిపినట్లు తేలిందని నివేదికలో తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిందని, అందులో 26 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు. ఈ దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై అనేక చర్యలు తీసుకుంది. ఇందులో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఉంది.






