- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kashmir: పాక్ నోట మళ్లీ అదే కూత.. ఆ దేశ ఉప ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు
పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ విషయంలో ఎన్నిసార్లు అబాసుపాలైనా పాకిస్తాన్ (Pakistan) తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ లో చావుతప్పి కన్ను లొట్ట పోయినంత పనైనా ప్రగల్భాలు మాత్రం మానడం లేదు. తాజాగా 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) మరోసారి కశ్మీర్ రాగాన్ని అందుకున్నారు. తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇషాక్ దార్ ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీయులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. భారత చట్ట విరుద్ధమైన చర్యలను సైనిక సన్నద్ధత, దౌత్యపరమైన నైపుణ్యం, ఐక్యత ద్వారా ప్రపంచ శాంతిని కాపాడుతూ సార్వభౌమత్వాన్ని రక్షించాలనే మన సంకల్పాన్ని చూపించామన్నారు. తన సందేశంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన ఇషాక్ దార్.. కశ్మీర్ (Kashmir Issue) సమస్య న్యాయమైనదేనన్నారు. కాశ్మీరీ ప్రజల పోరాటానికి పాకిస్తాన్ మద్దతు తిరుగులేదని, వారికి న్యాయం జరిగే వరకు పాకిస్తాన్ సపోర్ట్ ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ కు గట్టి షాక్ తగిలినా పాక్ మాత్రం తన మాటలు, చేతల్లోని వక్రబుద్ధిని మాత్రం వీడటం లేదనేది ఇషాక్ దార్ మాటలతో స్పష్టం అవుతోంది.






