PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణం ఇదే

by Muthe.Rajitha |

రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తెలిసిందే.

PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తెలిసిందే. అయితే ఇటీవల ఈ పథకం కింద లబ్ది పొందుతున్న లక్షలాది మంది రైతులను తొలగించారనే భారీగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం గైడ్ లైన్స్ ప్రకారం.. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదని వివరణ ఇచ్చింది.

అలాగే ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ది పొందుతున్నట్టు గుర్తించామని, అలాంటి వారికి తాత్కాలికంగా ఈ పథకాన్ని నిలిపివేశామని స్పష్టం చేసింది. అయితే వీరందరికీ మరోసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని, అందులో అర్హులని తేలితే మళ్ళీ జాబితాలో చేర్చుతామని తెలిపింది. అయితే అనర్హులని తేలితే ఇప్పటివరకు లబ్ది పొందిన మొత్తాన్ని తిరిగి కట్టేలా ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

Next Story