- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. రేబీస్ సోకితే ఇలా ప్రవర్తిస్తారా? మన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఆఖరి క్షణాల్లో ఏం చేశాడో చూడండి
వీధికుక్కల వల్ల ప్రాణాలకే ప్రమాదమని, వాటితో జాగ్రత్తగా ఉండాలని తరచూ పోలీసులు, వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. కుక్కకాటు వల్ల రేబీస్ సోకితే ఎలా ప్రవర్తిస్తారనేందుకు ఈ వీడియోలే నిదర్శనం.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. కొన్ని వీధుల్లో కుక్కలు పిల్లలపై దాడులు చేస్తూ తరచూ గాయపరుస్తున్నాయి. అందుకే స్థానికులు వాటిని తరిమికొడుతున్నారు. ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఢిల్లీ నగరంలో వీధి కుక్కల్ని నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా.. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కొందరు యువతీ, యువకులు వీధికుక్కలపై (Stray Dogs) జాలి తలచి వాటిని దగ్గరకు తీసుకుని ఆహారం పెడుతుంటారు. ఇలా చేయడం వారి ప్రాణాలకే ప్రమాదమని చెప్తున్నారు వైద్యులు. వీధికుక్కల్ని ఎంత ప్రేమగా చూసినా అవి మనపైనే దాడిచేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా రేబీస్ సోకితే ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి (Brijesh Solanki) రేబీస్ సోకి.. తన ఆఖరి క్షణాల్లో ఎంత విలవిలలాడాడో చూపించే వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. యూపీకి చెందిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలంకి.. ఓ వీధి కుక్కను రక్షించాడు. అతను రక్షించిన వీధి కుక్కే అతనిపై దాడి చేయగా.. రేబీస్ కు గురయ్యాడు. ఆ తర్వాత బ్రిజేష్ ను రక్షించడం వైద్యుల వల్ల కాలేదు. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆఖరికి ఆ వ్యాధే అతడిని కబళించింది. ఈ వీడియోనూ మేఘ్ అప్డేట్స్ అనే ఎక్స్ హ్యాండిల్లో యూజర్ పోస్ట్ చేశారు. దానితోపాటు మరో యువతి కూడా రేబీస్ కు గురై.. బెడ్డుకు కట్టేసి ఉండగా.. రేబీస్ వైరస్ శరీరమంతా వ్యాపించడంతో అలాగే కొట్టుమిట్టాడింది. కూతుర్ని రక్షించుకోలేకఆ తల్లిదండ్రులు ఒక పక్కన నిలబడి గుండెలవిసేలా రోధించారు. సో ఇకనైనా వీధికుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి. అయ్యో పాపం.. అని దగ్గరికి తీసుకుంటే అవే రేబీస్ రూపంలో మీ ప్రాణాలను హరించే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి.






