- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు కారణం ఇదే
ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో తొక్కిసలాట(Delhi Stampede) జరిగి 18 మంది మృతిచెందగా.. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో తొక్కిసలాట(Delhi Stampede) జరిగి 18 మంది మృతిచెందగా.. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉండగా.. మరణించిన 18మంది పేర్లను అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. కాగా ఈ ఘటనకు గల కారణాలపై అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వారాంతం కావడంతో ప్రయాగ్ రాజ్(Prayag Raj) కు వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా రైల్వేస్టేషన్ కు చేరుకోవడమేనని తేల్చారు.
వారాంతం కావడంతో ప్రయాగ్ రాజ్ కు వెళ్లేందుకు దాదాపు లక్షమంది వరకు ప్రయాణికులు శనివారం సాయంత్రం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆలస్యంగా వస్తున్న రైళ్ల కారణంగా ప్రయాగ్ రాజ్ వెళ్ళే రైలును ముందుగా ప్రకటించిన 3వ ప్లాట్‌ఫామ్ పైకి కాకుండా 13వ ప్లాట్‌ఫామ్ మీదికి వస్తుందని ప్రకటించగా.. ప్రయాణికులు హడావిడిగా పరుగెత్తడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులు వేగంగా పరుగెత్తే క్రమంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి ప్లాట్‌ఫామ్ నంబర్ 14, 15 వైపు వెళ్లే మెట్లపై జారిపడ్డారు. దీంతో వారి వెనక ఉన్నవారూ కిందపడ్డారు. దీంతో ఈ తొక్కిసలాట జరిగింది అని రైల్వే అధికారులు తెలిపారు. జనం భారీగా వస్తారని అంచనా వేసి, పలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ.. రెండు రైళ్లు ఆలస్యంగా నడవడంతో అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది అక్కడకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగిందని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
అయితే ప్రయాణికులు భారీగా రావడం, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో అప్పటికప్పుడు ఫ్లాట్ ఫాంలను మార్చడం.. అప్పటికే అక్కడ వేలాది ప్రజలు ఉండటంతో ఎలాగైనా వేగంగా రైలును అందుకోవాలని ప్రయాణికులు పరుగెత్తుతూ మెట్లపై జారీ పడటంతో వెనుక ఉన్నవారు ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.






