Third World War : థర్డ్ వరల్డ్ వార్ సమీపిస్తుందా.. !?

by Y. Venkata Narasimha Reddy |

రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine )ల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump )వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky)తో నిర్వహించిన భేటీ ఇరువురు మధ్య తీవ్ర వాగ్వివాదం..విభేధాల(Differences)తో అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఇక మూడో ప్రపంచం యుద్ధం(World War III) ముంచుకొస్తుందా అన్న చర్చ సోషల్ మీడియాలో ట్రెండింగ్(Trending)గా మారింది.

Third World War : థర్డ్ వరల్డ్ వార్ సమీపిస్తుందా.. !?
X

దిశ, వెడ్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine )ల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump )వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky)తో నిర్వహించిన భేటీ ఇరువురు మధ్య తీవ్ర వాగ్వివాదం..విభేధాల(Differences)తో అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఇక మూడో ప్రపంచం యుద్ధం(World War III) ముంచుకొస్తుందా అన్న చర్చ సోషల్ మీడియాలో ట్రెండింగ్(Trending)గా మారింది. శాంతి ఒప్పందానికి జెలెన్ స్కీ అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన ట్రంప్ నీవు మూడో ప్రపంచ యుద్ధంతో జూదమాడుతున్నావంటూ..ఇక మీకు మేం మద్ధతు తెలుపమని..మీది మీరు చూసుకోండంటూ తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్ కు అమెరికా సహాయం లేకపోతే రష్యా మరింత రెచ్చిపోతే ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చుంటున్నారు నిపుణులు.

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చేందుకు ఉక్రెయిన్ లో ఖనిజాల తవ్వకానికి మాతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ తాజా భేటీలో జెలెన్ స్కీకి సూచించారు. అయితే భవిష్యత్తులో మాపై రష్యా దురాక్రమణ చేయకుండా మీరు రక్షణ కల్పించాలంటూ జెలెన్ స్కీ కోరారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగిపోగా వారు అర్థాంతరంగా చర్చలను ముగించి ఉమ్మడి ప్రెస్ మీట్ ను సైతం రద్ధు చేసుకున్నారు. జెలెన్ స్కీ కి ఇక వైట్హౌస్ తలుపులు తెరుచుకోవని..మా దారికొస్తేనే ఇక మాటలు.. లేదంటే మాట్లల్లేవని డొనాల్డ్ ట్రంప్ తెగేసి చెప్పారు.

మరోసారి శాంతిచర్చలకు జెలెన్ స్కీ రావాలనుకుంటున్నప్పటికి నేను సిద్ధంగా లేనని..ఆయన శాంతికోరుకోవడం లేదంటూ ట్రంప్ ఆరోపించారు. ఇన్నాళ్లుగా సహాయం చేస్తున్న దేశం పట్ల జెలెన్ స్కీకి కృతజత లేదన్నారు.

అయితే జెలెన్ స్కీ మాత్రం వైట్ హౌస్ ఘటనలో తానేమి తప్పు చేయలేదని..ఇందులో క్షమాపణలు అవసరం లేదన్నారు. అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను తాము గౌరవిస్తామన్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదంలో ట్రంప్ తటస్థంగా, మావైపు ఉండాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఖనిజాల ఒప్పందం ఓ భద్రత హామీ మాత్రమేనన్నారు. చర్చల మధ్య వివాదంతో ఖనిజాల తవ్వకం ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్ స్కీ వెళ్లిపోయారు. చర్చల సందర్భంగా హంతకుడైన పుతిన్తో నేను రాజీపడే కొశ్చనే లేదని జెలెన్స్కీ తేల్చిచెప్పగా..అయితే నీవు చచ్చిపోతావని..ఉక్రెయిన్ నాశనం అయిపోయితుందన్నట్లు ట్రంప్ బెదిరించినట్లుగా కథనాలు వెలువడ్డాయి.

ఉక్రెయిన్ కు మద్ధతుగా ఆ దేశాలు

కాగా ట్రంప్ తో గొడవ పడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ ఉదంతం స్పందించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా, ఉక్రెయిన్లకు ఇది మంచిది కాదన్నారు. న్యూస్ తో జెలెన్స్కీ.. ట్రంప్, జెలెన్స్కీలతో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్కు మా మద్దతులో మార్పు లేదనిబ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా రష్యా దురాక్రమణపై గౌరవం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ కు మా మద్ధతు ఉంటుదన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలుఉర్సులా వాన్ డెర్ లేయన్ కూడా ప్రియమైన అధ్యక్షుడు జెలెన్ స్కీ మీరు ఎప్పటికి ఒంటరి కారు అంటూ తమ మద్ధతు తెలిపారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ లు కూడా ఉక్రెయిన్ మిత్రులారా మీరు ఒంటరి కారంటూ తమ మద్ధతు తెలిపారు. జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ కూడా జర్మని, యూరప్ పై ఉక్రెయిన్ ఆధారపడవచ్చని సూచించారు.

ట్రంప్, జెలెన్ స్కీ వివాదంపై ఇటలీ ప్రధాన జార్జియో మెలోని స్పందిస్తూ నేటి ఈ గొప్స సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా, ఈయూ దేశాలు భేటీ కావాలన్నారు. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్పందిస్తూ ఇది తీవ్ర నిరుత్సాహకరమైన సంఘటనగా చెప్పారు.

మూడో ప్రపంచ యుద్ధ భయాలు

ఉక్రెయిన్ కు అమెరికా మద్ధతుపై తాజాగా సందిగ్థత నెలకొనడంతో రష్యాను ఎదుర్కోవడం ఉక్రెయిన్ కు కష్టంగా మారనుంది. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కు మద్ధతుగా వస్తే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు. ఇప్పటికే రష్యాకు ఉత్తర కొరియా సైనిక మద్ధతు అందిస్తుంది. అటు దక్షిణ-ఉత్తర కొరియాల మధ్య విభేధాలు నెలకొన్నాయి. ప్రపంచంలో అనేక దేశాల మధ్య జరుగుతున్న పోరును చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా కొట్టివేయలేనిదిగా చాలా మంది చెబుతున్నారు.

అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై దాడులు..మధ్యలో ఇరాన్ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం మూడో ప్రపంచ యుద్ధం వైపు ఊహాగానాలను బలపరిచాయి. యెమన్, సిరియాలు కూడా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. తాజాగా ట్రంప్ అఫ్ఘానిస్తాన్ ను మళ్లీ ఆధీనంలోకి తెచ్చుకుంటామంటు చెప్పడం మరో కొత్త వివాదానికి దారితీసింది. ఇటు అసియాలో భారత్ తో చైనా, పాక్ కొత్తగా బంగ్లాదేశ్ లు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలకు తోడు ఉక్రెయిన్ కు అమెరికా సహాయం ఆగిపోయి రష్యా రెచ్చిపోతే నాటో దేశాలు యుద్ధంలో జోక్యం చేసుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చన్న చర్చలు నెటిజన్లలో సాగుతున్నాయి.

Next Story