ఎర్రకోట వద్ద నిందితుల రెక్కీ.. రిపబ్లిక్ డే రోజు పేలుళ్లకు ప్లాన్?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-12 04:30:42  IST  )

ఢిల్లీ కారు బాంబు బ్లాస్టింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఎర్రకోట వద్ద నిందితుల రెక్కీ.. రిపబ్లిక్ డే రోజు పేలుళ్లకు ప్లాన్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ కారు బాంబు బ్లాస్టింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో బాంబు తయారీకి వాడే పదార్థాలు విరివిగా లభించడంతో ఐఈడీగా మార్చకముందే పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా మరిన్ని కీలక విషయాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా పేలుళ్లు చేసేందుకు రెండేళ్లుగా ప్లాన్ చేస్తున్నట్లు ఉగ్రడాక్టర్ల విచారణలో వెల్లడైంది. ఎర్రకోట వద్ద ముందే నిందితులు రెక్కీ చేసినట్లు దర్యాప్తు సంస్థ NIA గుర్తించింది. 2026 జనవరి 26న రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్టింగ్స్ చేయాలని ప్లాన్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఎర్రకోట వద్దకు k-9 స్క్వాడ్ చేరుకున్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డే టార్గెట్ గా బ్లాస్టింగ్స్ జరిగే ఛాన్స్ ఉండటంతో k-9 స్క్వాడ్ భద్రతా తనిఖీలు చేపట్టింది.

మరోవైపు ఎర్రకోట పేలుళ్ల కేసులో 9వ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణాకు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్తియాక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రడాక్టర్లలో ఒకరైన ముజిమ్మిల్ అతని ఇంట్లోనే పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు గుర్తించారు.

Next Story