- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాక్‌కు న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేయడం అంత ఈజీనా?

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యూరీ, కుప్వారా, పూంఛ్, సాంబా సెక్టార్లలో పాక్ బలగాలు కాల్పులకు పాల్పడుతుండగా.. భారత సైన్యం వాటిని తిప్పికొడుతోంది. జైసల్మేర్‌లో సైరన్లు మోగడంతో అంతా బ్లాక్ అవుట్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు గుజరాత్ సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. కాగా.. భారత్ తమపై యుద్ధం చేస్తే.. న్యూక్లియర్ వెపన్‌ను లాంచ్ చేస్తామని పాక్ దౌత్యవేత్త ఇటీవల హెచ్చరించారు. పాకిస్థాన్ చెప్పినట్లు న్యూక్లియర్ వెపన్‌ను లాంచ్ చేయడం అంత ఈజీనా? దీనిపై వైష్ణవి అనే ఓ యువతి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో న్యూక్లియర్ వెపన్స్ లాంచ్‌కు సిద్ధంగా లేవని ఆ వీడియోలో పేర్కొంది. వాటిని లాంచ్ చేయాలనుకుంటే.. పాకిస్థాన్‌కు దెహ్రాగాజీ న్యూక్లియర్ సైట్ నుంచి అణుబాంబులను తీసుకుని 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరనావా మిస్సైల్ కాంప్లెక్స్‌లో అసెంబుల్ చేయాలి. ఆ తర్వాత అసెంబుల్ అయిన మిషన్‌ను 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న షబాద్ లేదా మసూర్ అనే లాంచ్ ప్యాడ్స్‌కు తీసుకెళ్లి లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఈ పని అవ్వడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో మన శాటిలైట్స్ లేదా వేరే దేశాలకు చెందిన శాటిలైట్స్ వాటిని గుర్తించి దాడిచేసే అవకాశం ఉంటుంది.
న్యూక్లియర్ వెపన్స్‌ను కలిగి ఉన్న న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. దీనిలో ఆ దేశానికి చెందిన టాప్ బ్యూరోక్రాట్స్, ఆర్మీ చీఫ్స్, పొలిటిషియన్స్ ఒక కమిటీగా ఉంటాయి. ఈ కమిటీ న్యూక్లియర్ వెపన్ లాంచ్‌కు అనుమతి ఇచ్చాక పీఎం ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. కంట్రీ ప్రెసిడెంట్ లేదా ప్రధాని వద్ద ఉన్న సీక్రెట్ కోడ్స్‌తోనే న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ప్రతి కంట్రీకి వర్తించదు. USA, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK వంటి దేశాలు నేరుగా న్యూక్లియర్ వెపన్‌ను లాంచ్ చేయవచ్చు. వాళ్లవద్ద అడ్వాన్స్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినపుడు ఆయనకు న్యూక్లియర్ ఫుట్‌బాల్ అని పిలవబడే ఒక సూట్‌కేస్ ఇచ్చారు. అందులో 5 వస్తువులు ఉంటాయి.
శాటిలైట్ ఫోన్ - ఇది డైరెక్ట్‌గా మిలిటరీ కమాండ్ సెంటర్‌తో కనెక్టై ఉంటుంది. 3 బుక్స్‌లో లాంచ్ ప్రొసీజర్, ప్రీ ప్లాన్డ్‌సైట్స్ ఉంటాయి. ఈ బ్యాగ్‌లో ఒక న్యూక్లియర్ బిస్కట్ ఉంటుంది. అందులో న్యూక్లియర్ సీక్రెట్ కోడ్స్ ఉంటాయి. ఎప్పుడైనా న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయాల్సిన పరిస్థితి వస్తే.. ప్రెసిడెంట్ ఈ కోడ్స్‌ను ఆర్మీ చీఫ్‌కు చెప్పాకే దానిని లాంచ్ చేయగలుగుతారు. సో.. న్యూక్లియర్ వెపన్‌ను లాంచ్ చేయడం రిమోట్‌లో బటన్ నొక్కినంత ఈజీ కాదు.