ఎన్నికల సంఘంపై ఒత్తిడి కారణంగానే అరుణ్ గోయల్ రాజీనామా: అఖిలేష్ యాదవ్

by Dishanational1 |
ఎన్నికల సంఘంపై ఒత్తిడి కారణంగానే అరుణ్ గోయల్ రాజీనామా: అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయెల్ రాజీనామా వ్యవహారంలో ఈసీపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారేమో అనే సందేహాలు కలిగిస్తున్నాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం ఎక్కువ ఒత్తిడితో పనిచేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 'ఎన్నికలకు ముందు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్(ఈసీ)పై ఎవరైనా ఒత్తిడి తెచ్చారేమో? బీజేపీ పాలనలో ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. అధికారులు ఒత్తిళ్లకు గురై ఉద్యోగాలను వదిలేయాల్సి వస్తుందని తెలుసని' అఖిలేష్ తెలిపారు. కాబట్టి తాజా పరిణామాలు ఈసీపై ఎవరి ఒత్తిడి ఉందోననే ప్రశ్నలను కలిగిస్తోంది. మార్చి 9న ఈసీ కమిషనర్‌గా అరుణ్ గోయెల్ తన రాజీనామాకు గల కారణాలను చెప్పలేదు. 2027, డిసెంబర్ 5 వరకు ఆయన పదవీకాలానికి గడువు ఉంది. ఆదివారం పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించిన అంశంపై మాట్లాడిన అఖిలేష్ యాదవ్, ఇది కేవలం ప్రదర్శన మాత్రమే. ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి బీజేపీ పనిచేసినట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది. అది కూడా ఇంకొకరు చేసిన పనిని తమదిగా చెప్పుకుంటోందని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. 'అజంగఢ్ విమానాశ్వయం నేతాజీ(ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్) నిర్మించారు. మొరాదాబాద్ విమానాశ్రయాన్ని కూడా ములాయాంతో కలిసి, సమాజ్ వాదీ పార్టీ నిర్మించింది. వీటినే మోడీ ప్రారంభించారు. ఇది తమ ప్రభుత్వ సొంత పనిగా బీజేపీ చెప్పుకుంటోందన్నారు.


Next Story

Most Viewed