Viral: రైల్వే స్టేషన్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న IRCTC సిబ్బంది.. రైల్వే మంత్రికి నెటిజన్ల ఫిర్యాదు

by Ramesh Naini |

రైల్వే స్టేషన్‌లో IRCTC సిబ్బంది పొట్టుపొట్టు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral: రైల్వే స్టేషన్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న IRCTC సిబ్బంది.. రైల్వే మంత్రికి నెటిజన్ల ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వే స్టేషన్‌లో IRCTC సిబ్బంది పొట్టుపొట్టు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని (Hazrat Nizamuddin) హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఓ ఎక్స్ యూజర్ శుక్రవారం వీడియో పోస్ట్ చేశారు. వైరల్ వీడియో ప్రకారం.. చిన్న కారణంతో మొదలైన వాగ్వాదం IRCTC సిబ్బంది మధ్య పెద్ద గొడవగా మారింది. కొద్దిసేపట్లోనే పరిస్థితి అదుపు తప్పి, ఒకరిపై మరొకరు పిడిగుద్దులు, బెల్ట్‌లు, డస్ట్‌బిన్‌లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన (Vande Bharat Train) వందే భారత్ రైలు బయలుదేరే ముందు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

సంఘటనను చూసిన వారు వెంటనే వీడియోలు తీయడం.. కొంత మంది ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత ఆర్పీఎఫ్ పోలీసులు, ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సిబ్బంది కొట్టుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ, రైల్వే మంత్రి అశ్వీని వైష్ణవ్‌‌కు నెటిజన్లు ఫిర్యాదులు చేశారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. అధికారుల స్పందన కోసం నెటిజన్‌లు ఎదురు చూస్తున్నారు. భారతీయ రైల్వేలో ప్లాట్‌ఫామ్‌పై మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కల్పించారని పలువురు నెటిజన్ సెటైర్లు వేశారు. వీడియో ఇదే..

Next Story