Iran war: ఇరాన్‍కు మరో బిగ్ షాక్.. తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ సైతం హతం!

by Prasad Jukanti |   (  Updated:2026-03-02 09:09:56  IST  )

ఖమేనీ మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ కూడా మరణించినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి.

Iran war: ఇరాన్‍కు మరో బిగ్ షాక్.. తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ సైతం హతం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‍కు (Iran) మరో భారీ షాక్ తగిలింది. ఇరాన్ సుప్రం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ బాధ్యతలు తాత్కాలికంగా స్వీకరించిన అలీ రెజా అరాఫీ (AliRezaArafi) సైతం హతమైనట్లు తెలుస్తోంది. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మేరుక సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అరాఫీ మరణంపై ఇరాన్ ఇంకా స్పందించలేదు.

గంటల వ్యవవధిలోనే:

ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ మరణాన్ని ధ్రువీకరించిన వెంటనే ఇరాన్ తమ తాత్కాలిక నాయకత్వాన్ని ప్రకటించింది. ఖమేనీ స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్ గా అరాఫీ వ్యవహరించనున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే సుప్రీం లీడర్‍ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటలకే వ్యవధిలోనే ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో అరాఫీ సైతం మరణించారనే వార్తలు యుద్ధరంగంలో ఇప్పుడు మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు టెహ్రాన్ అంతటిని షాక్ కు గురి చేస్తుండగా ఈ యుద్ధంలో ఏం జరుగుతోంది? ఈపరిణాణాలు ఎటువైపు దారి తీస్తాయనే టెన్షన్ ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెట్టుతున్నాయి.




Next Story