- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి.. IRGC ప్రకటన
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడి నిర్వహించినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది.
తాజా దాడిలో నెతన్యాహూ కార్యాలయం తో పాటు ఇజ్రాయెల్ వైమానిక దళాధిపతి ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామని IRGC తెలిపింది. ఇది అనూహ్యంగా చేపట్టిన దాడిగా పేర్కొంది. ఈ దాడి అనంతరం ప్రధాని నెతన్యాహూ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత లేదని ఇరాన్ టైమ్స్ పేర్కొంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకొని ఖచ్చితమైన దాడి నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ‘కొద్దిసేపటి క్రితమే బీరూట్‌లోని ఓ కీలక ప్రాంతంలో హిజ్బుల్లా సీనియర్ ఉగ్రవాదిపై దాడి చేశాం’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటనలో తెలిపింది.






