గుడ్‌న్యూస్ చెప్పిన ఇరాన్ ప్రభుత్వం.. భారత ఆయిల్ ట్యాంకర్లకు లైన్ క్లియర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-12 06:01:17  IST  )

రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన వేళ భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. హార్ముజ్ జలసంధిలో భారత ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు అనుమతినిచ్చింది.

గుడ్‌న్యూస్ చెప్పిన ఇరాన్ ప్రభుత్వం.. భారత ఆయిల్ ట్యాంకర్లకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోన్న వేళ ఇరాన్ (Iran) ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం భారత్‌ (India)కు కొత్త ఆశలను చిగురింపజేసింది. రూపాయి పతనంతో సతమతమవుతున్న వేళ, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జరిపిన చర్చలు ఫలించాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో జరిపిన సంప్రదింపుల తర్వాత వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇరాన్ తాజాగా నిర్ణయంతో భారత ఆయిల్ ట్యాంకర్లు అయిన పుష్పక్ (Pushpak), పరిమళ్ (Parimal) ద్వారా గల్ఫ్ దేశాల నుంచి మనం చమురును సులభంగా దిగుమతి చేసుకునే అవకాశం లభించింది.

కాగా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌కు మాత్రమే ఈ ప్రత్యేక మినహాయింపు లభించడం విశేషం. ఇక హార్ముజ్ జలసంధి నుంచి ఇండియన్ ఫ్లాగ్‌‌లతో వెళ్లే నౌకలకు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వనున్నారు. ఇది రానున్న రోజుల్లో చమురు ధరల స్థిరీకరణకు, పడిపోతున్న రూపాయి విలువను అదుపు చేయడానికి దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story