ఆంక్షలు ఎత్తేస్తే.. డీల్ చేసుకుంటాం.. యూఎస్‌కు ఇరాన్ భారీ ఆఫర్

by Phanindra |

ఆంక్షలు ఎత్తేస్తే.. డీల్ చేసుకుంటాం అపి యూఎస్‌కు ఇరాన్ భారీ ఆఫర్ ఇచ్చింది.

ఆంక్షలు ఎత్తేస్తే.. డీల్ చేసుకుంటాం.. యూఎస్‌కు ఇరాన్ భారీ ఆఫర్
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూక్లియర్ ప్రోగ్రాం విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు ఇరాన్ అంగీకరించింది. ఈ విషయంలో యూఎస్‌తో డీల్ చేసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఇలా చేయాలంటే తమపై అమెరికా విధించిన ఆంక్షలన్నీ ఎత్తేయాలని షరతు విధించింది. ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ మజీద్ తఖ్త్ రావాంచీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఇప్పుడు నిర్ణయం అమెరికా చేతుల్లో ఉందని, వారికి డీల్ కావాలో వద్దో యూఎస్ నిర్ణయించుకోవాలని రావాంచీ అన్నారు. ‘వాళ్లలో నిజాయితీ ఉంటే డీల్ జరుగుతుందని నమ్ముతున్నా. ఆంక్షలు ఎత్తేస్తామంటే న్యూక్లియర్ ప్రోగ్రాంపై పరిమితులు విధించేందుకు మా దేశం సిద్ధంగా ఉంది’ అని ఆయన స్పష్టంచేశారు. ఈ డీల్‌పై చర్చలను ఇరాన్ సాగదీస్తోందని, ఏ నిర్ణయం తీసుకోవడం లేదని ఇంతకాలం అమెరికా ఆరోపణలు చేసింది. ఇరాన్‌తో డీల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నట్లు ఇటీవలే యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా అన్నారు. ఇరాన్ తాజా ప్రకటనతో ఈ డీల్ జరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story