Iran vs Israel: స్కూల్‌పై బాంబుల వర్షం.. 36 మంది చిన్నారులు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-28 11:30:52  IST  )

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.

Iran vs Israel: స్కూల్‌పై బాంబుల వర్షం.. 36 మంది చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్(Iran vs Israel) మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. మినాబ్‌లోని ఓ స్కూల్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 36 మంది స్కూల్ విద్యార్థులు మృతిచెందారు. మరోవైపు ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే పశ్చిమాసియాలోని అమెరికా నౌకా, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్ సహా ఏనిమిది దేశాలపై ఏకకాలంలో ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. బహ్రెయిన్‌లోని మనామాలో ఉన్న అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్టీట్‌‌పై మిస్సైల్ దాడితో ఎమర్జెన్సీ సైరెన్లు మోగించారు. భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు తెలిపారు. అలాగే, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ రాజధాని అబుదాబిలోనూ పేలుళ్లు చోటుచేసుకున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు, రెండు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని ఖతార్ కూల్చివేసినట్టు నివేదికలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఇరాన్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు ముందుజాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేశాయి. అటు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశాయి.

Next Story