అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ చెక్.. యుద్ధం క్లోజ్ చేసేందుకు సరికొత్త ఎత్తుగడ!

by Kema Shiva Kumar |

అమెరికా ప్రతిపాదించిన రెండు నెలల కాల్పుల విరమణను తిరస్కరించిన ఇరాన్, 30 రోజుల్లో యుద్ధాన్ని ముగించేలా 14 పాయింట్ల ప్లాన్‌ను ప్రకటించింది.

అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ చెక్.. యుద్ధం క్లోజ్ చేసేందుకు సరికొత్త ఎత్తుగడ!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (Western Asia)లో ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో ఇరాన్ (Iran) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా (America) ఇచ్చిన 2 నెలల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆ దేశం సున్నితంగా తిరస్కరించింది. దానికి బదులుగా, కేవలం 30 రోజుల్లోనే శత్రుత్వానికి పూర్తిగా ముగింపు పలికేలా రూపొందించిన 14 పాయింట్ల ప్రణాళిక‌ను తెరపైకి తెచ్చింది. రెండు నెలల పాటు కాల్పుల విరమణ పాటించాలన్న అమెరికా ప్రతిపాదన.. సమస్యను మరింత సాగదీయడమేనని ఇరాన్ అభిప్రాయపడింది.

శాంతి స్థాపన పేరుతో కాలయాపన చేయడం తమకు ఇష్టం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తాము ప్రతిపాదించిన 14 పాయింట్ల సూత్రాలను అమలు చేస్తే, కేవలం నెల రోజుల్లోనే సరిహద్దుల్లో సాధారణ స్థితిని తీసుకురావచ్చని వెల్లడించింది. ఈ రహస్య ప్రణాళికలో ప్రధానంగా సైనిక బలగాల ఉపసంహరణ, మానవీయ సహాయానికి మార్గం సుగమం చేయడం, సరిహద్దుల్లో శాశ్వత భద్రతను నెలకొల్పేలా కఠిన నిబంధనలు ఉన్నట్లుగా సమాచారం. అయితే, అమెరికా ప్రతిపాదనను కాదని ఇరాన్ స్వయంగా ఓ కార్యాచరణను ప్రకటించడం ద్వారా అంతర్జాతీయ దౌత్య రంగంలో ఆ దేశం తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.

Next Story