- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్‌పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. బూర్జు ఖలీఫా ఖాళీ
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు చేదాటిపోయాయి. ఇరు దేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా దుబాయ్‌ని ఇరాన్ టార్గెట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్(Iran vs Israel) మధ్య పరిస్థితులు చేదాటిపోయాయి. ఇరు దేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా దుబాయ్‌ని ఇరాన్ టార్గెట్ చేసింది. దుబాయ్‌పై వరుసగా మిస్సైళ్ల వర్షం కురిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన దుబాయ్ అధికారులు.. పర్యాటక ప్రాంతాలకు అలర్ట్ మెసేజ్ జారీ చేశారు. ముఖ్యంగా బూర్జు ఖలీఫాను ఖాళీ చేయిస్తున్నారు. ఇరాన్ దాడి చేస్తుందన్న ముందస్తు భయంతో దుబాయ్ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు మూసివేశారు. విమానాలు నిలిపివేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా జరిపిన దాడుల్లో ప్రాణనష్టంపై తొలి నివేదిక వచ్చింది. మినాబ్‌లోని బాలిక స్కూల్‌పై జరిపిన దాడిలో 36 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మినాబ్‌లో ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్ స్థావరం ఉండటంతో దానిపై దాడి జరిగింది. దీనికి సమీపంలోనే బాలికల పాఠశాల ఉండటం వల్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రభావితమైంది. ఇప్పటి వరకు 36 మంది పిల్లలు బలికాగా.. డజన్ల కొద్దీ గాయపడినట్టు తెలుస్తోంది.






