Iran Port: ఇరాన్ ఓడరేవులో పేలుడు.. 40కి చేరిన మృతుల సంఖ్య

by B.Srinivas |

ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌ వాణిజ్య ఓడరేవులో జరిగిన భారీ పేలుడులో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది.

Iran Port: ఇరాన్ ఓడరేవులో పేలుడు.. 40కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌ (Iran)లోని బందర్ అబ్బాస్‌ వాణిజ్య ఓడరేవులో జరిగిన భారీ పేలుడులో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది. అలాగే గాయపడిన వారి సంఖ్య 1000కి పెరిగింది. ఘటన జరిగిన ప్రదేశంలో రవాణా కంటైనర్లు, చమురు, ఇతర పెట్రోకెమికల్ పదార్థాలు నిల్వ చేస్తారని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ పేలుడు వల్ల ఎటువంటి ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినలేదని అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రదేశంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయని మరో రెండు రోజుల్లో పరిస్థితి పూర్తి సాధారణంగా మారుతుందని వెల్లడించారు. క్షతగాత్రులో 190 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ (Masoud Pezeshkian) ఆదివారం పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Next Story